మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Krishna Stotram (Viprapatni Krutam) – శ్రీ కృష్ణ స్తోత్రం (విప్రపత్నీ కృతం)


త్వం బ్రహ్మ పరమం ధామ నిరీహో నిరహంకృతిః |
నిర్గుణశ్చ నిరాకారః సాకారః సగుణః స్వయమ్ || 1 ||

సాక్షిరూపశ్చ నిర్లిప్తః పరమాత్మా నిరాకృతిః |
ప్రకృతిః పురుషస్త్వం చ కారణం చ తయోః పరమ్ || 2 ||

సృష్టిస్థిత్యంతవిషయే యే చ దేవాస్త్రయః స్మృతాః |
తే త్వదంశాః సర్వబీజా బ్రహ్మవిష్ణుమహేశ్వరాః || 3 ||

యస్య లోమ్నాం చ వివరే చాఖిలం విశ్వమీశ్వర |
మహావిరాణ్మహావిష్ణుస్త్వం తస్య జనకో విభో || 4 ||

తేజస్త్వం చాపి తేజస్వీ జ్ఞానం జ్ఞానీ చ తత్పరః |
వేదేఽనిర్వచనీయస్త్వం కస్త్వాం స్తోతుమిహేశ్వరః || 5 ||

మహదాదిసృష్టిసూత్రం పంచతన్మాత్రమేవ చ |
బీజం త్వం సర్వశక్తీనాం సర్వశక్తిస్వరూపకః || 6 ||

సర్వశక్తీశ్వరః సర్వః సర్వశక్త్యాశ్రయః సదా |
త్వమనీహః స్వయంజ్యోతిః సర్వానందః సనాతనః || 7 ||

అహోఽప్యాకారహీనస్త్వం సర్వవిగ్రహవానపి |
సర్వేంద్రియాణాం విషయం జానాసి నేంద్రియీ భవాన్ || 8 ||

సరస్వతీ జడీభూతా యత్ స్తోత్రే యన్నిరూపణే |
జడీభూతో మహేశశ్చ శేషో ధర్మో విధిః స్వయమ్ || 9 ||

పార్వతీ కమలా రాధా సావిత్రీ వేదసూరపి |
వేదశ్చ జడతాం యాతి కే వా శక్తా విపశ్చితః || 10 ||

వయం కిం స్తవనం కుర్మః స్త్రియః ప్రాణేశ్వరేశ్వరః |
ప్రసన్నో భవ నో దేవ దీనబంధో కృపాం కురు || 11 ||

ఇతి పేతుశ్చ తా విప్రపత్న్యస్తచ్చరణాంబుజే |
అభయం ప్రదదౌ తాభ్యః ప్రసన్నవదనేక్షణః || 12 ||

విప్రపత్నీకృతం స్తోత్రం పూజాకాలే చ యః పఠేత్ |
స గతిం విప్రపత్నీనాం లభతే నాఽత్ర సంశయః || 13 ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే అష్టాదశోఽధ్యాయే విప్రపత్నీకృత శ్రీ కృష్ణ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.